Worship

సమానులెవరు ప్రభో

Samaanulevaru Prabho

Watch on YouTube
సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో (2) సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమును (2) సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో|| సమాన తత్వము - సహోదరత్వము (2) సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో|| పరార్ధమై భవ - శరీర మొసగిన (2) పరోపకారా నరావ తారా (నీ) (2) ||సమానులెవరో|| దయా హృదయ యీ - దురాత్మ లెల్లరున్ (2) నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2) ||సమానులెవరో|| ఓ పావనాత్ముడ - ఓ పుణ్య శీలుడ (2) పాపాత్ములను బ్రోవ - పరమాత్మ సుత (నీ) (2) ||సమానులెవరో||