Hymns
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
Ruchi Choochi Erigithini Yehovaa Utthamudanuyu
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2)
||రుచి చూచి||
గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2)
||రుచి చూచి||
మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా (2)
మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2)
||రుచి చూచి||
మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో (2)
ముదమార పాడెద నిన్ను - అతి సుందరడవనియు (2)
||రుచి చూచి||
కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2)
క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2)
||రుచి చూచి||
ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2)
సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2)
||రుచి చూచి||
