Worship

రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు

Randi Randi Yesuni Yoddaku Rammanuchunnaadu

Watch on YouTube
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే యేసుని పిలుపు వినియు నింక - యోచింపరేల అవనిలో అగచాట్ల పాలైన అబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి|| కరువు రణము మరణము చూచి - కలుగదు మారుమనస్సు ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి వచ్చుచున్నారు ||రండి|| ప్రభు యేసు నీ కొరకై తనదు - ప్రాణము నిచ్చె గదా సిలువను రక్తము చిందించియును బలియాయెను యా ఘనుడు మనకై ||రండి|| యేసుని నామమునందె పరమ - నివాసము దొరకును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే యిచ్చును ||రండి|| నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును నేను గాకింకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని వద్దకు ||రండి||