రాజుల రాజా రానైయున్నవాడా (2)
నీకే ఆరాధన
నా యేసయ్యా.. నీకే ఆరాధన (2)
కష్టాలలో జయమిచ్చ్చును - శోధనలో జయమిచ్చును
సాతానును ఓడించును - విజయము చేకూర్చును (2)
నా మార్గము యేసయ్యా - నా జీవము యేసయ్యా
నా సత్యము యేసయ్యా - స్తుతులు నీకేనయ్యా (2)
||రాజుల||
రోగాలను స్వస్థపరచును - శాపాలనుండి విడిపించును
మరణమునుండి లేవనెత్తును - పరలోకము మనకిచ్ఛును (2)
ప్రతి మోకాలు వంగును - ప్రతి నాలుక పాడును
ప్రతి నేత్రము చూచును - నిన్నే రారాజుగా (2)
||రాజుల||
