Worship

రాజా నీ సన్నిధి లోనే

Raajaa Nee Sannidhi Lone

Watch on YouTube
రాజా నీ సన్నిధి-లోనే దొరికెనే ఆనందమానందమే జీవా జలముతో పొంగే హృదయమే పాడే స్తుతియు స్తోత్రమే శ్రమల వేళా నీ ధ్యానమే నా గానం ఆధారం ఆనందమే నిలువని సిరుల కన్ననూ క్షయమౌ ప్రేమ కన్ననూ విలువౌ కృపను పొందగన్ - భాగ్యమే నిలువని సిరుల కన్ననూ క్షయమౌ ప్రేమ కన్ననూ విలువౌ కృపను పొందితిన్ - స్తోత్రమే ||రాజా|| మరల రాని కాలమల్లె - తరలిపోయే నాదు దోషం నిలువదాయె పాప శాపాల భారం (2) నీలో నిలిచి ఫలియించు తీగనై ఆత్మ ఫలము పొందితినే ||నిలువని|| తెలియరాని నీదు ప్రేమ - నాలో నింపే ఆత్మ ధైర్యం జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం (2) నీకై నిలిచి ఇలలోన జీవింప ఆత్మ ఫలము పొందితినే ||నిలువని||