Worship

ప్రేమగల మా ప్రభువా

Premagala Maa Prabhuvaa

Watch on YouTube
ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా (2) ||ప్రేమగల|| నీదు ప్రేమ నిత్యమైనది - కరుణతో నాకర్షించె (2) నిక్కముగ రుజువాయెను - ప్రాణమిచ్చుట ద్వారనే (2) ||ప్రేమగల|| అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2) అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2) ||ప్రేమగల|| బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2) వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను (2) ||ప్రేమగల|| తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2) తండ్రి ప్రేమ మారదు - మార్పుచెందని ప్రేమయే (2) ||ప్రేమగల|| మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా (2) వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2) ||ప్రేమగల||