Encouragement

ప్రీతిగల మన యేసు డెంతో గొప్ప మిత్రుడు

Preethigala Mana Yesu Dentho Goppa Mithrudu

Watch on YouTube
ప్రీతిగల మన యేసు - డెంతో గొప్ప మిత్రుడు మితిలేని దయచేత - హత్తుచు ప్రేమించును క్రీస్తునొద్ద మన భార - మంత నప్పగించినన్ శక్తిగల యేసు చేత - మోత లెల్ల వీడును నీతిగల మన యేసు - ధృతిగల మిత్రుడు మృతి బొంది కృపతో వి - శ్రాంతి కలిగించెను భీతి నొందు బాపులైన - జింతా క్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత - క్రొత్త గతి జూతురు దయగల మన యేసు - ప్రియమైన మిత్రుడు మాయలోకమందు నిజా - శ్రయుడై కాపాడును భయ దుఃఖ శ్రమ లాది - మోయరాని బాధలన్ జయ మొప్ప నేర్పి యేసు - స్థాయి వృద్ది చేయును ధారుణిలో యేసుగాక - వేరు గొప్ప మిత్రుడా? పరలోకమందు యేసే - వీరుడౌ రక్షకుడు నారకుల! గావ వేగా - గ్రూర హింస బొందెను కరుణించి నిచ్చి ప్రతి - ప్రార్థన నాలించును