ప్రకటింతును నీ సువార్తను
సకల జనులకు సహనముతో
సత్య వాక్యము ధ్యానించుచు
సమయమునందు అసమయమునందు (2)
||ప్రకటింతును||
లోకము నన్ను ద్వేషించినా
లోకులు నన్ను దూషించినా (2)
నా వారు నన్ను నిందించినా
నా ప్రియులే నన్ను విడనాడినా (2)
నిందలు మోపి హింసలు పెట్టినా
ప్రకటింతును నీ సువార్తను (2)
||ప్రకటింతును||
ఆత్మల రక్షణ కొరకై నేను
అలయక ముందుకు సాగెదను (2)
అంతము వరకు ప్రకటింతును
మరణించి లేచిన ప్రభుయేసును (2)
హత సాక్షులలో చేరుటకైన
ప్రయాసపడెద సువార్తకై (2)
||ప్రకటింతును||
గురియొద్దకు నేను పరుగెత్తుచూ
తిన్నని మార్గము నే నడిచెద (2)
యేసుని పనులను శ్రద్ధతో చేయుచు
జీవ మకుఠము ఆశించుచూ (2)
జీవ పునరుత్ధానమునే
పొందుటకై నే ప్రకటింతును (2)
||ప్రకటింతును||
