Prayer

ప్రభువా ప్రభువా కడలిని మా గాథ వినవా

Prabhuvaa Prabhuvaa Kadalini Maa Gaatha Vinavaa

Watch on YouTube
ప్రభువా ప్రభువా కడలిని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి గనవా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్ ||ప్రభువా|| ఎదలో చెలరేగే సుడిగాలుల్లో ఎగసే ఆశ నిరాశ కెరటాలు నావకు చుక్కానివై నాలో ధైర్యం కలిగించవా సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా|| దేవా నీ దయలో ధన్యుడనవ తగనా నాలో విశ్వాసం ఇంకా చాలాదనా మందలో నీ అండలో నేను ఉన్నా గొర్రెపిల్లనై దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా||