ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పొందితిమి కృప వెంబడి కృపను
ప్రభువైన యేసు క్రీస్తు - పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు
||ప్రభువా||
జనకా నీ-వెన్నుకొనిన - జనుల క్షేమము జూచి
సంతోషించునట్లు - నను జ్ఞాపకముంచుకొనుము
||ప్రభువా||
నీదు స్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలిసి
కొనియాడునట్లుగా - నను జ్ఞాపకముంచుకొనుము
||ప్రభువా||
దేవా నీదు స్వరూప - దివ్య దర్శనమును
దినదినము నాకొసగి - నను జ్ఞాపకముంచుకొనుము
||ప్రభువా||
మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకు
డనిన మహోన్నతుడా - నను జ్ఞాపకముంచుకొనుము
||ప్రభువా||
ముదమారా నన్నెన్నుకొని - ముద్ర యుంగరముగను
చేతుననిన ప్రభువా - నను జ్ఞాపకముంచుకొనుము
||ప్రభువా||
కృపా సత్య సమ్మిళిత - సంపూర్ణ స్వరూప
హల్లెలూయా నీకే ప్రభో - ఎల్లప్పుడూ కలుగుగాక
||ప్రభువా||
