Praise

పిల్లలారా నా మాట వినుడి

Pillalara Naa Maata Vinudi

Watch on YouTube
పిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదను – (2) ||పిల్లలారా|| బ్రతుక గోరువాడెవడైన కలడా? (2) మేలునొందుచు చాలా దినములు (2) ||పిల్లలారా|| కపటమైన చెడు మాటలాడక (2) కాచుకొనుము నీదు పెదవులను (2) ||పిల్లలారా|| కీడు మాని మేలునే చేయుము (2) సమాధానము వెదకి వెంటాడు (2) ||పిల్లలారా|| యెహోవా దృష్టి నీతిమంతులపై (2) కలదు వారి మొఱల వినును (2) ||పిల్లలారా|| దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి (2) కొట్టివేయు తన సన్నిధి నుండి (2) ||పిల్లలారా|| నీతిమంతులు మొఱ పెట్టగా (2) విని శ్రమల నుండి తప్పించును (2) ||పిల్లలారా|| విరిగినట్టి హృదయములకు (2) యెహోవా ఆసన్నుడై యున్నాడు (2) ||పిల్లలారా|| నలిగియున్న వారల నెల్ల (2) ఆయనే రక్షించు ప్రేమగల్గి (2) ||పిల్లలారా||