Christmas
పసి బాలుడై ప్రేమా రూపుడై ఇమ్మానుయేలు దైవమై
Pasi Baaludai Premaa Roopudai Immaanuyelu Daivamai
పసి బాలుడై ప్రేమా రూపుడై - ఇమ్మానుయేలు దైవమై
నీతి తేజమై సత్య రూపమై - బలమైన నా దుర్గమా
దీనుడవై పరమును విడిచి - నా కొరకు దిగి వచ్చావు
నా రక్షణ కొరకై నీవు - నర రూపము ధరించినావు
రండి రండి నేడు బెత్లహేము పురముకు
రండి రండి ఆ యేసు రాజునొద్దకు
రండి రండి పరిశుద్ధాత్ముని యొద్దకు
రండి రండి నేడు ఉత్సహించి పాడుటకు
||పసి బాలుడై||
యేసు రాజు పుట్టేనని హల్లేలూయా
గంతులు వేసి పాడుదమా హల్లేలూయా
నిజ రక్షకుడు అని హల్లేలూయా
ఆరాధించెదము హల్లేలూయా
||రండి||
ఆశ్చర్యకరుడని యేసు హల్లేలూయా
పరిశుద్ధుడు అని పాడుదమా హల్లేలూయా
రాజులకు రాజు హల్లేలూయా
ఘనపరచి కీర్తింతున్ హల్లేలూయా
||రండి||
