Wedding
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
Parishuddha Parishuddha Parishuddha Prabhuvaa
పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా (2)
వరదూతలైనా నిన్ - వర్ణింప గలరా
వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా
పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ (2)
నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా
నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా
పరిశుద్ధ తనయుడ - నర రూప ధారుడ (2)
నరులను రక్షించు - కరుణా నముద్రా
నరులను రక్షించు (3) కరుణా నముద్రా
పరిశుద్ధ మగు నాత్మ - వరము లిడు నాత్మ (2)
పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా
పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా
జనక కుమారాత్మ - లను నేక దేవ (2)
ఘన మహిమ చెల్లును - దనర నిత్యముగా
ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా
