Devotional

పైనున్న ఆకాశమందునా

Painunna Aakaashamandunaa

Watch on YouTube
పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా (2) లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన (2) ||పైనున్న|| అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామము (2) యేసు నామములో శక్తి కలదు (2) దోషులకు శాశ్వత ముక్తి కలదు (2) ||పైనున్న|| అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవము (2) నాశనమునకు జోగేడి వారికి (2) యేసు నామమే రక్షణ మార్గము (2) ||పైనున్న|| యేసు నామము స్మరియించగానే మనసు మారి నూతనమగును (2) బేధమేమియు లేదెవ్వరికిని (2) నాథుని స్మరియించి తరింప (2) ||పైనున్న||