Evangelism

ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా

O Yaathrikudaa Oho Yaathrikudaa

Watch on YouTube
ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా ఓ బాటసారి ఓహో బాటసారి జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది (2) అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| పుట్టగానే తొట్టెలో వేస్తారు గిట్టగానే పెట్టెలో మూస్తారు జాగు చేయక కాటికి మోస్తారు ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ ఆ (2) బ్రతుకు మూల్యమింతే మనిషికి ఉన్న విలువంతే (2) అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు ఏడిపిస్తూ సమాధికి పోతావు కూడబెట్టినవి మోసుకు పోలేవు ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ ఓ (2) జీవిత సారము ఇంతే మనిషి బ్రతుకు భావము అంతే (2) అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| మరణము ఒక నిద్ర యేసునందు అంతము అది కాదు క్రీస్తునందు మృతులు లేచుట స్థిరము యేసునందు నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ ఆ (2) నేడే రక్షన సమయము ఇక ఆలసించిన నరకము (2) అంతా ఆ దైవ నిర్ణయం మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||