Worship

ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా

O Sanghamaa Sarvaangamaa Paraloka Raajyapu Prathibimbamaa

Watch on YouTube
ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగ నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా రాణి ఓఫిరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో వీణ వాయిద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము (2) పొందితినే యేసునందు (2) ||ఓ సంఘమా|| క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణ మర్పించెనని స్వస్థపరచె నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగ మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2) సహియింతువా తీర్పునాడు (2) ||ఓ సంఘమా|| చీకటిలో నుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు శ్రీకర గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2) సజీవముగా నున్నావా (2) ||ఓ సంఘమా|| చల్లగనైన వెచ్చగను ఉండిన నీకది మేలగును నులివెచ్చని స్థితి నీకుండిన బయటకు ఉమ్మి వేయబడుదువేమో నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2) ఆసక్తితో రక్షణ పొందుమా (2) ||ఓ సంఘమా||