Dedication
నిను గాక మరి దేనిని - నే ప్రేమింపనీయకు
Ninu Gaaka Mari Denini - Ne Premimpaneeyaku
నిను గాక మరి దేనిని - నే ప్రేమింపనీయకు (2)
నీ కృపలో నీ దయలో - నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుమో యేసు
||నిను గాక||
నా తలపులకు అందనిది - నీ సిలువ ప్రేమా
నీ అరచేతిలో నా జీవితం - చెక్కించుకొంటివే
వివరింప తరమా నీ కార్యముల్
ఇహ పరములకు నా ఆధారం - నీవై యుండగా
నా యేసువా - నా యేసువా
||నిను గాక||
రంగుల వలయాల ఆకర్షణలో - మురిపించే మెరుపులలో
ఆశా నిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే
నా గమ్యము నీ రాజ్యమే - నీ రాజ్యమే
నా యేసువా - నా యేసువా
||నిను గాక||
