Encouragement

నిన్ను కాపాడు దేవుడు

Ninnu Kaapaadu Devudu

Watch on YouTube
నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు - నిదురపోడు వాగ్ధానమిచ్చి మాట తప్పడు నమ్మదగినవాడు - నమ్మదగినవాడు భయమేల నీకు - దిగులేల నీకు (2) ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా శోధనలలో - నిన్ను నెట్టినా (2) కోడి తన పిల్లలను కాచునంతగా కాపాడు దేవుడు నీకు ఉండగా (2) భయమేల నీకు - దిగులేల నీకు (2) కాపాడు గొప్ప దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| రోగ భారమందు లేవకున్ననూ వ్యాధులు నిన్ను కృంగదీసినా (2) చనిపోయిన లాజరును తిరిగి లేపిన స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2) భయమేల నీకు - దిగులేల నీకు (2) స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు||