Thanksgiving

నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా

Nibbaramutho Naa Yesuke Sthuthi Paadedhaa

Watch on YouTube
నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2) యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా యేసయ్యా… యేసయ్యా… మహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో|| కష్టకాలమందు నాకు - కనికరము చూపెను కాలుజారుతున్నవేళ - కరుణతో నిలిపెను (2) కడుపు కాలుతున్నవేళ - నా కడుపు నింపెను కన్నీటి బ్రతుకును - నాట్యముగా మార్చెను కఠినమైన కాలములో - నా చెంత నిలిచెను ||యేసయ్యా|| దిక్కుదెసలేని నాకు - దర్శనము నిచ్చెను ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2) దిక్కుతోచని వేళ - నా దిక్కై నిలిచెను దుష్ట శక్తులన్నిటిని - నాకు దూరపరచెను దీవెనలు కుమ్మరించి - ధన్యునిగా చేసెను ||యేసయ్యా||