Faith
నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
Nenu Velle Maargamu - Naa Yesuke Theliyunu
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను (2)
||నేను||
కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
గురిలేని తరుణాన వెరువగ - నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)
జలములలోబడి నే వెళ్లినా - అవి నా మీద పారవు (2)
అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)
విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు (2)
సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)
||నేను||
