Thanksgiving

నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను

Nenellappudu Yehovaa Ninu Sannuthinchedhanu

Watch on YouTube
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) నిత్యము నా కీర్తి నా నోట నుండును (2) మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు|| కలిమి చేజారి నను వంచినా స్థితిని తలకిందులే చేసినా (2) రెండింతలుగా దయచేసెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| పరుల ఎగతాళి శృతి మించినా కలవరము గుండెనే పిండినా (2) నా మొఱ విని కృప చూపెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| శ్రమలు చెలరేగి బెదిరించినా ఎముకలకు చేటునే తెచ్చినా (2) ఆపదలలో విడిపించెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||