నేనంటే నీకెందుకో ఈ ప్రేమా
నన్ను మరచి పొవెందుకు (2)
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
నన్ను విడిచిపోవెందుకు
కష్టాలలో నష్టాలలో
వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలో కడగండ్లలో
వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు
ప్రాణమా.. నా ప్రాణమా - (2)
||నేనంటే||
నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు
నిన్ను వీడిపోయినా - నన్ను వీడిపోలేవు (2)
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
ఏ ఋణమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను
||నేనంటే||
ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు
మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2)
ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
ఏ బలమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను
||నేనంటే||
