Encouragement

నీవు తోడైయుండగా యేసు - భయము లేదు ఇలలో

Neevu Thodaiyundagaa Yesu - Bhayamu Ledhu Ilalo

Watch on YouTube
నీవు తోడైయుండగా యేసు - భయము లేదు ఇలలో మేలు చేయు దేవుడా నీకు - సాటి లేరు సృష్టిలో ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చిననూ లెక్కలేని నిందలే నన్ను బాధించిననూ ||నీవు తోడైయుండగా|| గతం గాయాన్ని చేయగా - గాయం హృదయాన్ని చీల్చగా శోకం సంద్రంలా ముంచగా - లోకం బంధాలే తెంచగా పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి ||నీవు తోడైయుండగా|| ఆశ నిరాశగా మారినా - నిరాశ నిస్పృహ పెంచినా యుక్తి తెలియక తిరిగినా - శక్తి క్షీణించిపోయినా వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి ||నీవు తోడైయుండగా|| నీవు నాకు అండగా నిలచి - దారి చూపినావయ్యా నేను నీకు మెండుగా స్తుతులు - అర్పించెదను