Devotional

నీవు లేని రోజు అసలు రోజే కాదయా

Neevu Leni Roju Asalu Roje Kaadhayaa

Watch on YouTube
నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2) నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2) నన్ను విడువనన్నవు - నా దేవుడైనావు (2) ||నీవే|| ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2) నీవు నా సొత్తన్నావు - కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే||