నీవు లేని క్షణమైనా ఊహించలేను
నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2)
నీవే నా కాపరి - నీవే నా ఊపిరి
నీవే నా సర్వము యేసయ్య
నీతోనే జీవితం - నేనే నీకంకితం
గైకొనుమో నన్ను ఓ దేవా…
||నీవు లేని||
శ్రమలెన్నో వచ్చినా - శోధనలే బిగిసినా
నను ధైర్యపరిచె నీ వాక్యం
సంద్రాలే పొంగినా - అలలే ఎగసినా
నను మునగనీయక లేవనెత్తిన (2)
నీవే నా కండగా - నాతో నీవుండగా
భయమన్నదే నాకు లేదూ
సర్వలోక నాధుడా - కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…
||నీవు లేని||
శత్రువులే లేచినా - అగ్ని ఆవరించినా
అవి నన్ను కాల్చజాలవుగా
దుష్టులే వచ్చినా - సింహాలై గర్జించినా
నాకేమాత్రం హాని చేయవుగా (2)
వెన్నుతట్టి బలపరచిన - చేయిపట్టి నడిపించిన
వేదనలే తొలగించిన యేసయ్యా
సర్వలోక నాధుడా - కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…
||నీవు లేని||
