నీవేయని నమ్మిక
యేసు నాకు.. నీవేయని నమ్మిక
నీవే మార్గంబు - నీవే సత్యంబు
నీవే జీవంబు - నీవే సర్వంబు
||నీవే||
పెడదారిని బోవగ
నా మీదికి.. ఇడుమలెన్నియో రాగ
అడవిలో బడి నేను - ఆడలుచు నుండగ
తడవకుండ దొరుకు - ధన్యమౌ మార్గంబు
||నీవే||
కారు మేఘము పట్టగ
నా మనస్సులో.. కటిక చీకటి పుట్టగ
ఘోరాపదలు చేరి - దారియని భ్రమపడగ
తేరి చూడగల్గు - తేజోమయ మార్గంబు
||నీవే||
లేనిపోని మార్గంబు
లెన్నోయుండ.. జ్ఞానోపదేశంబు
మానుగ జేయుచు - వానిని ఖండించి
నేనే మార్గంబన్న - నిజమైన మార్గంబు
||నీవే||
నరలోకమునుండి
పరలోకంబు.. వరకు నిచ్చెనగా నుండి
నరులకు ముందుగా - నడుచుచు ముక్తికి
సరిగా కొనిపోవు సు-స్థిరమైన మార్గంబు
||నీవే||
