Friendship

నీతో స్నేహం నే మరువగలనా

Neetho Sneham Ne Maruvagalanaa

Watch on YouTube
నీతో స్నేహం నే మరువగలనా నిన్ను విడచి నేను ఉండగలనా నీతో స్నేహం నే మరువగలనా నా స్నేహితుడా… నా యేసయ్యా (2) విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో|| నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా|| నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగా కష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగా అపాయమేమి రాకుండగా – కాచేవాడవు నీవేగా ఎన్నటికైనా మారని నీదు – స్నేహమే మధురముగా ప్రేమను పంచిన నా నేస్తం నీవేగా ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా||