నీతో సమమెవరు - నీలా ప్రేమించేదవరు
నీలా క్షమియించేదెవరు - యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన - వారెవరు (2)
లోక బంగారము - ధన ధాన్యాదులు
ఒక పోగేసినా - నీతో సరితూగునా
జీవ నదులన్నియు - సర్వ సంద్రములు
ఒకటై ఎగసినా - నిన్ను తాకగలవా
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన
నీవేగా చాలిన దేవుడవు
||నీతో||
పలు వేదాలలో - మత గ్రంథాలలో
పాపమే సోకని - పరిశుద్దుడేడి
పాప పరిహారార్థం - సిలువ మరణమొంది
తిరిగి లేచినట్టి - దైవ నరుడెవ్వరు
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా
నీవేగా మంచి దేవుడవు
||నీతో||
నేను వెదకకున్నా - నాకు దొరికితివి
నేను ప్రేమించకున్నా - నన్ను ప్రేమించితివి
పలు గాయాలు చేసి - తరచు రేపితిని
నన్నెంతో సహించి - క్షమియించితివి
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి
నీవేగా విమోచకుడవు
||నీతో||
