Hymns

నీతిగల యెహోవా స్తుతి మీ

Neethigala Yehovaa Sthuthi Mee

Watch on YouTube
నీతిగల యెహోవా స్తుతి మీ - ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి - దాతయవు మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి ||నీతి|| చదల బుడమియు రవియు జలధియు - నదులు గిరులును జక్కగా సదమలంబగు దైవ నామము - సర్వదా నుతి జేయును ||నీతి|| సర్వశక్తుని కార్యముల కీ - సర్వ రాష్ట్రము లన్నియు గర్వములు విడి తలలు వంచుచు - నుర్విలో నుతిజేయను ||నీతి|| గీత తాండవ వాద్యములచే - బ్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు - దాతనే సేవించుడి ||నీతి|| పరమ దూతలు నరులు పుడమిని - మొరలుబెట్టుచు దేవుని పరము నందున్నట్టి యేసుని - పాదములు సేవింతురు ||నీతి|| ఇలను భక్తులు గూడుకొనియా - బలము గల్గిన దేవుని వెలయు స్తుతి వే నోళ్ళతోడను - విసుగు జెందక జేయుడి ||నీతి|| ఆత్మ నీవిక మేలుకొని శు - ధ్ధాత్మ యేసుని దండ్రిని త్రిత్వమగునా యేక దేవుని - హర్షమున సేవింపవే ||నీతి||