నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో
||నీ స్వరము||
ఉదయమునే లేచి - నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు - నను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి - (2)
||నీ స్వరము||
నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు
నేను సరి చేసికొందు
నీ మార్గములో - నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడూ - (2)
||నీ స్వరము||
భయ భీతులలో - తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను - (2)
||నీ స్వరము||
నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో - సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా - (2)
||నీ స్వరము||
నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లు - (2)
||నీ స్వరము||
నా హృదయములోని - చెడు తలంపులను
చేధించు నీ వాక్యము
నీ రూపమునకు - మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా - (2)
||నీ స్వరము||
