Worship

నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన

Nee Premaa Nee Karunaa Chaalunayyaa Naa Jeevithaana

Watch on YouTube
నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన చాలయ్య చాలీ దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2) ||నీ ప్రేమా|| గురిలేని నన్ను గుర్తించినావే ఎనలేని ప్రేమను చూపించినావే వెలలేని నాకు విలువిచ్చినావే విలువైన పాత్రగా నను మార్చినావే (2) ||నీ ప్రేమా|| చేజారిన నాకై చేచాచినావే చెదరిన నా బ్రతుకును చేరదీసినావే చెరనుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే (2) ||నీ ప్రేమా|| నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే నీ కుమారునిగా నను మార్చినావే (2) ||నీ ప్రేమా||