Devotional

నీ పద సేవయే చాలు

Nee Padha Sevaye Chaalu

Watch on YouTube
నీ పద సేవయే చాలు యేసు నాకదియే పది వేలు నీ పద సేవయే చాలు నీ పద జ్ఞానము నాకిలా క్షేమము నీ పద గానము నాకిలా ప్రాణము (2) ||నీ పద|| నీ నామమునే స్తుతియింపగను నీ వాక్యమునే ధ్యానింపగను (2) నీ రాజ్యమునే ప్రకటింపగను (2) దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| నీ దరినే నివసింపగను జీవమునే సాధింపగను (2) సాతానును నే నెదిరింపగాను (2) దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| నీ ప్రేమను నే చూపింపగను నీ త్యాగమునే నొనరింపగను (2) నీ సహనమునే ధరియింపగను (2) దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||