Good Friday

నీ పాదముల్ నే చేరగా

Nee Paadhamul Ne Cheragaa

Watch on YouTube
నీ పాదముల్ నే చేరగా - గాయంబులున్ నే గాంచితిన్ నీ సిలువకై నే చేరగా - నీ ప్రేమను నే పొందితిన్ నా కొరకే ఈ మరణమా - నా పాపమే కారణమా (2) ||నీ పాదముల్|| నా అతిక్రమముల బట్టి గాయపరచబడెగా నా దోషములను బట్టి నలుగగొట్టబడెగా (2) సమాధానార్థమైన శిక్ష మీద పడెను పాపపరిహార్థ బలిగ వధియించబడెను (2) ||నా కొరకే|| వధకు తేబడు గొర్రెపిల్ల నిలచునట్లుగా మౌనముగా నుండి నీవు తీర్పునొందితివివే (2) నీ వేదన చూసి హేళన చేసిన గానీ వీరేమి చేతిరో ఎరుగరంటివే (2) ||నా కొరకే||