Devotional

నీ కంటిపాపను

Nee Kantipaapanu

Watch on YouTube
నీ కంటిపాపను - నా కంటనీరు చూడలేవు నీ చల్లని చూపులో - నేనుందును నీ కృపలో (2) యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2) కన్నవారు నీ దారి నీదన్నారు నమ్మినవారే నవ్విపోయారు విరిగి నలిగి నీవైపు చూశాను తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు ||యేసయ్యా|| ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు ఎంతగానో ప్రేమించి లాలించావు నా ఊపిరీ నా ప్రాణమూ నీ దయలోనే నా జీవితం ||యేసయ్యా|| నీ మాటలో నా బాటను నీ ప్రేమలో నా పాటను సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు ||యేసయ్యా||