నీ జ్ఞాపకం అనేకులను - ప్రభు వైపుకు త్రిప్పుచుండెనా
నీ జ్ఞాపకం ఆత్మీయులకు - క్షేమాభివృద్ధి నిచ్చుచుండెనా (2)
నీ జ్ఞాపకం నీవు మరణించినా
మరణాంతర పరిచర్య చేయునా (2)
మరణాంతర పరిచర్య చేయునా
||నీ జ్ఞాపకం||
పేతురన్న జ్ఞాపకం - పశ్చాత్తాప పరిమళం
పౌలన్న జ్ఞాపకం - పోరాటపు ప్రోత్సాహం (2)
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2)
||నీ జ్ఞాపకం||
బర్నబాన్న జ్ఞాపకం - ఆదరణానందము
తిమోతన్న జ్ఞాపకం - విశ్వాస విజయము (2)
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2)
||నీ జ్ఞాపకం||
ఫిలిప్పన్న జ్ఞాపకం - సువార్త సునాదము
స్తెఫనన్న జ్ఞాపకం - క్రీస్తుని స్వారూప్యము (2)
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2)
||నీ జ్ఞాపకం||
