నన్ను కాదనవని - నను కాదనలేవని
నీ చెంతకు నే చేరినా (2)
నీ ప్రేమే చాలని - నిను ప్రేమించాలని
నీ మనసే నే కోరినా (2)
||నన్ను||
లోకాన్ని చూసి నే - పాపాన్ని చేసి నే
అలసి నీ చెంత చేరినా (2)
సాతానుకు దొరికిన - లోకానికి లొంగిన
నీవే నా దిక్కని ఎంచినా - (2)
||నన్ను||
లాభాన్నాశించి నే - లోపాలు చేసి నే
సొలసి నీ శరణు కోరినా (2)
శోధనలు లొంగిన - వంచనలకు ఒరిగిన
నీవే ఆధారమని యెంచినా - (2)
||నన్ను||
