నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా
నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2)
మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా
ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా
||నమ్మకురా||
ధనము చదువు నేర్పునురా - సంస్కారం నేర్పదురా
ధనము మందులు కొనునురా - ఆరోగ్యం ఇవ్వదురా (2)
వస్తువాహనాల కాధారం
సుఖ సంతోషాలకు బహుదూరం (2)
||నమ్మకురా||
ధనము పెళ్ళి చేయునురా - కాపురము కట్టదురా
ధనము సమాధి కట్టునురా - పరలోకం చేర్చదురా (2)
డబ్బును నమ్మకురా
గబ్బు పనులు చేయకురా (2)
||నమ్మకురా||
ధనము ఆస్తిని పెంచునురా - అనురాగం తుంచునురా
ధనము పొగరు పెంచునురా - పరువు కాస్త తీయునురా (2)
ధనము కోరిక తీర్చునురా
నరకానికి చేర్చునురా (2)
||నమ్మకురా||
