నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును - దేవా నీకేమి అర్పింతును (2)
హల్లెలూయా యేసునాథా - కృతజ్ఞతా స్తుతులివే (2)
||నాకెన్నో||
కృప చేత నన్ను రక్షించినావే
కృప వెంబడి కృపతో - నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే
నా పాపమును కడిగి - పరిశద్ధపరచితివే (2)
||హల్లెలూయా||
నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే - ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే - నాకభయమిచ్చితివే (2)
||హల్లెలూయా||
నా కాడి మోసి నా తోడు నీవే
నీ చేతి నీడలో - నను దాచియున్నావే
ఏ కీడు నాకు రాకుండ చేసి
నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2)
||హల్లెలూయా||
నీ రాజ్యమందు నను చేర్చుకొందువు
రానున్న రారాజువు - నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు
నను కొన్నవాడవు - నా వరుడవు నీవు (2)
||హల్లెలూయా||
