Worship

నా పూర్ణ హృదయముతో స్తుతియించెదను

Naa Poorna Hrudhayamutho Sthuthiyinchedhanu

Watch on YouTube
నా పూర్ణ హృదయముతో స్తుతియించెదను నా పూర్ణ మనసుతో కీర్తించెదను (2) యేసునాథా జీవప్రధాత - క్రీస్తునాథా మోక్ష ప్రదాత (2) అనుదినము నీయందె అతిశయింతును ప్రతి క్షణము నీలోనే పరవశింతును (2) నీ దివ్య శిలువే నాకు విలువనిచ్చెను నీదు గాయములే స్వస్థత చేకూర్చెను (2) నీదు మరణమే నాకు జీవమిచ్చెను (2) నీ పునరుత్థానమే క్రొత్త జన్మనిచ్చెను (2) ||అనుదినము|| నీ వాక్యముతో నిత్యము బ్రతికించుచున్నావు నీ కృపతో నిరతము సేదదీర్చుచున్నావు (2) ఇహపరముల యందు నీవే నాకుండగా (2) నీకంటె మించినది నాకు లేదుగా (2) ||అనుదినము||