Encouragement

నా కలవరములన్ని కనుమరుగు చేసినావు

Naa Kalavaramulanni Kanumarugu Chesinaavu

Watch on YouTube
నా కలవరములన్ని కనుమరుగు చేసినావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు - (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| నీ చేయి నన్ను సంరక్షించెను నా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| నిన్ను నమ్మువారు సీయోనులో చేరి నిత్యానందపు భాగ్యమును పొందెదరు (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||