నా చెలిమి కోరి - నీ కలిమి వీడి
నా చెంత చేరావు శ్రీమంతుడా
నా రక్షణ కొరకై - ఆ శిక్షను పొంది
బలియాగమైన నిజ స్నేహితుడా
||నా చెలిమి||
ద్రోహినై దూరమైతిని - పాపినై పరుగులెడితిని
గమ్యమే ఎరుగనైతిని - మరణమే శరణమాయెను
ఎంతో ప్రేమించితివి - నా స్థానమందు నిలిచితివి
కృపతో నన్ రక్షించితివి - నా దోషశిక్ష భరించితివి
||నా చెలిమి||
నిందలు అవమానములు - హేళనలు చీత్కారములు
కఠిన దెబ్బలు ముళ్లపోటులు - సిలువ భారం కాయమంతా గాయం
హృదినే బాధించినా - భరియించావు వేదన మౌనముగా
తనువే తల్లడిల్లినా - తృప్తినొందావు నను తలచుకొని
||నా చెలిమి||
ఏ రీతి నిన్ను - కీర్తించగలను
నా నీతి నీవే ఓ యేసుదేవా
నీ సాక్షిగ నిలిచి - నీ ప్రేమను చాటి
ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా
