Faith

మేము భయపడము ఇక మేము భయపడము

Memu Bhayapadamu Ika Memu Bhayapadamu

Watch on YouTube
మేము భయపడము - ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2) ||మేము|| దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే (2) దీవారాత్రులు దేవుడే కాయును ||మేము|| శత్రు కోటి మమ్ము జుట్టన్ పాతాళము మ్రింగ జూడన్ (2) నిత్యుడు యేసు నిత్యము కాయును ||మేము|| అగ్ని పరీక్షల యందు వాగ్ధానమిచ్చె మాతో నుండ (2) ఏ ఘడియైనను విడువక కాయును ||మేము|| బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి (2) పలు విధములుగా కాపాడు మమ్ము ||మేము|| కునుకడు మన దేవుడు యెన్నడు నిద్రించడు (2) కను పాపగా మము కాపాడునెప్పుడు ||మేము|| జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచ (2) దేవుడొసంగిన ఈవుల నెంచుచు ||మేము|| ఇహమందు మన శ్రమలన్ని మహిమకు మార్చెడు ప్రభున్ (2) మహిమపరచి మ్రొక్కెదములలో ||మేము||