మేలుకో! మహిమ రాజు
వేగమే రానై యున్నాడు (2)
పరమునుండి - బూర ధ్వనితో
అరయు నేసు - ఆర్భాటముతో (2)
సర్వలోకము - తేరిచూచును
త్వరపడు ఓ ప్రియుండా (2)
||మేలుకో||
గురుతులెల్ల - ధరణియందు
సరిగ చూడ - జరుగుచుండ (2)
చిరునవ్వుతో - చేరి ప్రభుని
త్వరపడు ఓ ప్రియుండా (2)
||మేలుకో||
క్రీస్తునందు - మృతులెల్లరు
కడబూర - మ్రోగగానే (2)
క్రీస్తువలె - తిరిగి లేతురు
లేతువా? నీవు ప్రియుడా (2)
||మేలుకో||
అరయంగ - పరిశుద్ధులు
మురిసెదరు - అక్షయ దేహులై (2)
పరమందు - ప్రభుక్రీస్తు
నిరతము - ఓ ప్రియుండా (2)
||మేలుకో||
కరుణలేని - ఓ మరణమా
నిరతము నీకు జయమగునా (2)
మరణ సంహా - రుండేసు
త్వరగా - రానై యున్నాడు (2)
||మేలుకో||
మాంసలోక - పిశాచాదులు
హింస పరచ - విజృంభించిన (2)
లేశమైనను - జడియకుము
ఆశతో - కాచుకొనుము (2)
||మేలుకో||
పాపమును - చేయకుమా
రేపకుమా - దైవ కోపమును (2)
శాపమును - తప్పుకొని
శ్రద్ధతో - కాచుకొనుమా (2)
||మేలుకో||
