మంగళమే యేసునకు - మానుజావతారునకు (3)
శృంగార ప్రభువునకు (2)
క్షేమాధిపతికి మంగళమే
||మంగళమే||
పరమ పవిత్రునకు - వర దివ్య తేజునకు (3)
నిరుపమానందునకు (2)
నిపుణ వేద్యునకు మంగళమే
||మంగళమే||
దురిత సంహారునకు - వర సుగుణోదారునకు (3)
కరుణా సంపన్నునకు (2)
జ్ఞాన దీప్తునకు మంగళమే
||మంగళమే||
సత్య ప్రవర్తునకు - సద్ధర్మ శీలునకు (3)
నిత్య స్వయంజీవునకు (2)
నిర్మలాత్మునకు మంగళమే
||మంగళమే||
యుక్త స్తోత్రార్హునకు - భక్త రక్షామణికి (3)
సత్య పరంజ్యోతి యగు (2)
సార్వభౌమునకు మంగళమే
||మంగళమే||
నర ఘోర కలుషముల - నురుమారంగ నిల (3)
కరుదెంచిన మా పాలి (2)
వర రక్షకునకు మంగళమే
||మంగళమే||
పరమపురి వాసునకు - నర దైవ రూపునకు (3)
పరమేశ్వర తనయునకు (2)
బ్రణుతింతుము నిన్ను మంగళమే
||మంగళమే||
