Thanksgiving

మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు

Manche Leni Naa Paina Entho Prema Choopaavu

Watch on YouTube
మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2) ఆదియంత మైనవాడవు - మానవుని రూపమెత్తావు (2) పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2) ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ ఋణము తీరునా (2) ||మంచే లేని|| లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2) నీదెంత దీన మనస్సు నా కెంత ఘనత యేసు (2) ||ఎంతగా|| నాశనమైన నన్ను రక్షించగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు (2) నీలోన జాలి పొంగె నాలోన శాంతి నిండె (2) ||ఎంతగా|| చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు (2) నీ సాటిలేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం (2) ||ఎంతగా||