మహిమగల తండ్రి - మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు (2)
తన పుత్రుని రక్తనీరు - తడి కట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను - కాపుగా వుంచాడు (2)
కాయవే తోటా - కమ్మని కాయలు
పండవే చెట్టా - తియ్యని ఫలములు (2)
||మహిమ||
నీతి పూత జాతి కర్త - ఆత్మ సుతా ఫలములు
నీ తండ్రి నిలువచేయు - నిత్య జీవ ఫలములు (2)
అనంతమైన ఆత్మ బంధ - అమర సుధా కాంతులు (2)
అనుకూల సమయమయ్యె - పూయు పరమ పూతలు (2)
||కాయవే||
అపవాది కంటబడి - కుంటుబడి పోకు
కాపుకొచ్చి చేదు పండ్లు - గంపలుగా కాయకు (2)
అదిగో గొడ్డలి వేరు - పదును పెట్టియున్నది (2)
వెర్రిగా చుక్కలనంటి - ఎదిగి విర్రవీగకు (2)
||కాయవే||
కలువరి కొండలో పుట్టి - పారిన కరుణా నిధి
కలుషమైన చీడ పీడ - కడిగిన ప్రేమానిధి (2)
నిజముగాను నీవు - నీ సొత్తు కావు (2)
యజమాని వస్తాడు - ఏమి ఫలములిస్తావు (2)
||కాయవే||
ముద్దుగా పెంచాడు - మొద్దుగా నుండకు
మోదమెంతో ఉంచాడు - మోడుబారి పోకు (2)
ముండ్ల పొదలలో కృంగి - మెత్తబడి పోకు (2)
పండ్లు కోయ వచ్చువాడు - అగ్నివేసి పోతాడు (2)
||కాయవే||
