Devotional

మారని ప్రేమచూపు ప్రాణ స్నేహితుడా

Maarani Prema Choopu Praana Snehithudaa

Watch on YouTube
మారని ప్రేమచూపు ప్రాణ స్నేహితుడా నను మనిషిగా మలచిన నీ ప్రేమకెవరు సరిరారు మార అనుభవాలను మధురముగా మర్చిన నా విమోచకా నీకన్నా నాకిలలో లేరెవరు మిన్నగా నీవేగా ప్రతిగడియా కాచావు నాన్నగా నా ప్రాణం నా ధ్యానం ఎన్నటికీ నీవేగా నీకోసం జీవిస్తా కడవరకు సాక్షిగా ||మారని ప్రేమచూపు|| ఒంటరి బ్రతుకులో వీడని నీడలా నాతో నడచిన నాదైవమా ఆశల సుడులలో చిక్కిన వేళలో విడుదలనిచ్చిన ఆత్మ బంధమా (2) శాశ్వత ప్రేమను నాపై చూపిన ఆశ్రిత పాలకా నా ప్రియ రక్షకా తుది శ్వాస వరకు కరుణ చూపుమా ||నీకన్నా|| బంధువులందరు మరచిన వేళలలో అండగా నిలిచిన ఆప్త మిత్రమా వంచనకారుల మోసపు తలపుల వలలో పడనీయని వాక్య రూపమా (2) నీ సన్నిధానపు ఒడిలో పెంచుచు తల్లిని మించిన ప్రేమను పంచుచు నీ సేవకొరకు నన్ను నిలుపుమా ||నీకన్నా||