Worship

మా సర్వానిధి నీవయ్యా

Maa Sarvaanidhi Neevayyaa

Watch on YouTube
మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా యేసయ్యా... యేసయ్యా... మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి|| మా పాపములకై కలువరి గిరిపై నలిగితివా మా ప్రియ యేసయ్యా (2) విరిగి నలిగిన హృదయాలతో (2) స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా|| నీవే మార్గము - నీవే సత్యము నీవే జీవము - మా యేసయ్యా (2) జీవపు దాత శ్రీ యేసునాథ (2) స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా|| మా స్నేహితుడవు - మా రక్షకుడవు పరిశుద్ధుడవు - మా యేసయ్యా (2) పరిశుద్ధమైన నీ నామమునే (2) స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా||