Christmas

లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు

Lokamanthata Velugu Prakaashinchenu Yesu Janminchinappudu

Watch on YouTube
లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి (2) లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ॥లోకమంతట॥ నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దాని గ్రహింప లేదు నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు వాడు చీకటిలో నడువక (2) జీవపువెలుగై యుండుడనె యేసు ॥లోకమంతట॥ ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైన నక్కరలేదు ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె (2) పిల్లయే దీపమై వెలుగుచుండు ॥లోకమంతట॥ విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక విూరు వెలుగు సంబంధులు విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే మరుగై యుండక నరులందరికి (2) వెలుగై యుందురనె యేసుండు ॥లోకమంతట॥ చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద ప్రకాశించెను గొప్ప వెలుగు (2) ప్రభువు యేసుకు జేయని పాడరే ॥లోకమంతట॥