Dedication

కొండల తట్టు నా కన్నులెత్తి

Kondala Thattu Naa Kannuleththi

Watch on YouTube
కొండల తట్టు నా కన్నులెత్తి చూచున్నాను నీ వైపు కరములు చాపి నీ వాగ్దానముకై వేచియున్నాను నీ ముందు నా సహాయుడా నా సమర్ధుడా నా సజీవుడా జయమిచ్చు జయశీలుడా కునుకవు నీవు నిదురించవు నిరతము నా మొరలను ఆలకింతువు నీ కార్యములు ఆశ్చర్యములు నీ యోచనలు మహనీయము రుచి చూచితిని నా బాల్యమునుండి సాగిపోదును ఈ దృఢ విశ్వాసముతో నా సహాయుడా నా సమర్ధుడా నా సజీవుడా జయమిచ్చు జయశీలుడా కునుకవు నీవు నిదురించవు నిరతము నా మొరలను ఆలకింతువు కునుకవు నీవు నిదురించవు నిత్య నిబంధన స్థిరపరచెదవు నీటిని చీల్చి మార్గము చేసి ఆరిన నేలపై నడిపిన దేవా అగ్నిలో చేరి తోడుగ నడిచి సజీవ సాక్షిగ నిలిపిన దేవా (2) పర్వతములను తొలగించుము నీ వాగ్ధానమును నెరవేర్చుము (2) నా సహాయుడా నా సమర్ధుడా నా సజీవుడా జయమిచ్చు జయశీలుడా కునుకవు నీవు నిదురించవు నిరతము నా మొరలను ఆలకింతువు